Posted by CityPolice-Admin on 2026-03-24 10:02:47 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు... ఈ పేరు చెప్పగానే టెక్నాలజీ గుర్తుకువస్తుంది. దీని వినియోగానికి కేరాఫ్ అడ్రస్గా
ఉన్న రాష్ట్రం అనేక ప్రాంతాలకు మార్గదర్శకమైంది. కేసు నమోదు నుంచి దర్యాప్తు, అభియోగపత్రాల దాఖలు వరకు ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాథమిక అంశమైన అధికారిక వెబ్సైట్ నిర్వహణలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పునర్వ్యవస్థీకరణను పట్టించుకోకుండా, అధికారుల బదిలీలపై దృష్టి పెట్టకుండా, అదనపు బాధ్యతలు తప్పినా ఇన్చార్జ్లను కొనసాగిస్తూ దీని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజధానిలోని కమిషనరేట్లలో జరిగిన మార్పుచేర్పులను పట్టించుకోవట్లేదు. కొన్ని బదిలీ, బాధ్యతల స్వీకరణ జరిగి ఇప్పటికి నెలన్నర అవుతున్నా అధికారిక వెబ్సైట్ (tspolice.gov.in)లో మాత్రం మార్పుచేర్పులు లేవు. ఇలాంటి చిత్రాలు మరెన్నో రాష్ట్ర పోలీసు అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి.వాటిలో కొన్ని ఇవి...
జనవరి 17న జరిగిన ఐపిఎస్ బదిలీల్లో భాగంగా ఐపిఎస్ అధికారి ఎస్. చైతన్యకుమార్ నగర డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డిసీపీగా వచ్చారు. అంత వరకు ఈ పోస్టుకు అదనపు సీపీ ఎం. శ్రీనివాసులు ఇన్చార్జ్ ఉన్నారు. అంతర్థానమైపోయిన సౌత్ ఈస్ట్ జోన్ను కొనసాగిస్తున్న పోలీసు వెబ్సైట్ దీనికి చైతన్యకుమార్ డిసీపీగా ఉన్నట్లు చూపిస్తోంది.
నగర పోలీసు విభాగంలో పరిపాలన డీసీపీగా కె. వెంకట లక్ష్మి నియమితులయ్యారు. అయినా ఇప్పటికీ తఫ్ఫీర్ ఇక్బాల్ను వెబ్సైట్ ఇన్చార్జ్ కొనసాగిస్తోంది. ఈయన నగరంలో సౌత్ రేంజ్ అదనపు సీపీగా నియమితులైనా... ఇంకా సంయుక్త సీపీ శాంతిభద్రతలుగానే చూపిస్తోంది.
గతంలో నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్కు డిసీపీగా పని చేసిన అపూర్వ రావు కొన్నాళ్ల ఇంటెలిజెన్స్కు బదిలీ అయ్యారు. అధికారిక వెబ్సైట్ మాత్రం ఈ విషయం పట్టించుకోలేదు.
రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు హైదరాబాద్లో కలిశాయి. అలాగే నగరంలో ఉన్న జోన్ల పేర్లు ఈస్ట్, వెస్ట్, సెంట్రల్... నుంచి సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్... ఇలా మారాయి. ఈ అంశమూ వెబ్సైట్ నిర్వాహకులకు పూర్తిగా పట్టలేదు. రక్షితా మూర్తిని సికింద్రాబాద్ డిసిపి అంటూ అప్డేట్ వెర్షన్ నమోదు చేసినా.. కె.శిల్పవల్లిని మాత్రం ఇప్పటికీ సెంట్రల్ జోన్ డీసీపీగానే వెబ్సైట్ సంబోధిస్తోంది. రాజేంద్రనగర్ను సైబరాబాద్ చూపిస్తున్న సైట్... అక్కడ ఉన్న డిసీపీ శ్రీనివాస్కు బదులు యోగేష్ గౌతం అంటూ కొనసాగిస్తోంది.
రాచకొండ కమిషనరేట్ పేరు మల్కాజ్గరిగా మారింది. అవినాష్ మహంతిని దీనికి కమిషనర్గా చూపిస్తున్న వెబ్సైట్... మహేశ్వరం జోన్ను మాత్రం రాచకొండగానే కొనసాగిస్తోంది. మరికొందరు డిసీపీ పోస్టులూ రాచకొండలో ఉన్నట్లే పేర్కొంటోంది. నగర సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా కె. శ్యామ్ సుందర్ వచ్చినా... ఇప్పటికీ అపూర్వ రావే ఇన్చార్జ్ అని వెబ్సైట్ చెస్తోంది.