మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. 3 ఎలివేటెడ్ కారిడార్ల‌తో ట్రాఫిక్ స‌మస్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం

Traffic & Road Safety Traffic & Road Safety

Posted by CityPolice-Admin on 2026-03-24 10:30:24 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:


మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. 3 ఎలివేటెడ్ కారిడార్ల‌తో ట్రాఫిక్ స‌మస్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల నుంచి సిటీ సెంటర్‌కు వచ్చే వారికి గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నగర విస్తరణకు కొత్త ప్రణాళిక

హైదరాబాద్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అనే రెండు ప్రధాన ఆర్థిక మండలాలుగా అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకెళ్తోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా కొత్త రోడ్డు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్‌, నిర్మాణంలో ఉన్న RRR మధ్య కనెక్టివిటీ పెంచడం వల్ల నగర విస్తరణ మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు.

Search
Recent News