ఆ ఫొటోలు అడుగుతారు, త‌ర్వాత అస‌లు రూపం బ‌య‌ట పెడ‌తారు.. అమ్మాయిల పేరెంట్స్‌కి స‌జ్జ‌నార్ వార్నింగ్‌

Crime & FIR News Crime & FIR News

Posted by CityPolice-Admin on 2026-03-24 10:44:09 | Last Updated by CityPolice-Admin on 2026-03-24 12:46:17

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:


ఆ ఫొటోలు అడుగుతారు, త‌ర్వాత అస‌లు రూపం బ‌య‌ట పెడ‌తారు.. అమ్మాయిల పేరెంట్స్‌కి స‌జ్జ‌నార్ వార్నింగ్‌

Hyderabad నగర పోలీస్‌ కమిషనర్‌ వి.సి. సజ్జనార్‌ సోషల్‌ మీడియా వినియోగంపై యువతికు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా యువతులు అపరిచితులతో ఆన్‌లైన్‌లో పరిచయాలు పెంచుకోవడం వల్ల ఎదుర‌య్యే ప్ర‌మాదాల గురించి ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.ప్ర‌మాదంగా మారుతోన్న స్మార్ట్‌ఫోన్

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌, సోషల్‌ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. కానీ ఇదే సాంకేతికత కొంతమందికి ప్రమాదకరంగా మారుతోందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పేర్కొన్నారు. సోషల్‌ మీడియా విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చిన తర్వాత అపరిచితులతో ఏర్పడే పరిచయాలు పెరిగాయి. వాటి వల్ల ముఖ్యంగా యువతులు అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇటీవల తన దృష్టికి వ‌చ్చిన‌ కొన్ని సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, వాటి గురించి తెలిసినప్పుడు చాలా బాధగా అనిపిస్తోందని అన్నారు.

Search
Recent News