Posted by CityPolice-Admin on 2026-03-24 11:03:33 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
ఈనాడు, హైదరాబాద్: అగ్నిప్రమాదాల నివారణకు అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నట్లు రామోజీ ఫిల్మ్ సిటీ (ఆర్ఎఫ్సీ) భద్రతా విభాగం పేర్కొంది. సున్నా ప్రమాదాలే లక్ష్యంగా సిబ్బందికి శిక్షణ తరగతులు, ఎప్పటికప్పుడు మాక్అల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎండీ సీహెచ్. విజయేశ్వరి, ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ ఎం. శివరామకృష్ణ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. అధునాతన అగ్నిమాపక పరికరాలను ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసినట్లు ఆర్ఎఫ్సీ చీఫ్మేనేజర్ (మెకానికల్) ఎస్. రామకృష్ణ వెల్లడించారు. ప్రతి భవనంలో స్ప్రింక్లర్, యార్డ్ హైడ్రెంట్ వ్యవస్థ, 9 ఫైర్పంప్ స్టేషన్లు, 2 ఫైర్ టెండర్లు, 18మంది సుశిక్షితులైన అగ్నిమాపక సిబ్బంది ఉన్నారని తెలిపారు. ప్రతినెలా అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే ఈ సిబ్బంది రక్షణ చర్యల్లో పాల్గొంటారని వెల్లడించారు. పర్యాటకులు క్షేమంగా వచ్చి వెళ్లేలా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆర్ఎప్సి భద్రతా విభాగం చీఫ్ మేనేజర్ ఉదయ్ కిరణ్ తెలిపారు. 'అగ్ని నివారణ చర్యలు పాటిద్దాం.. సురక్షిత భారతదేశాన్ని నిర్మిద్దాం' నినాదంతో అవగాహన కార్యక్రమాల నిర్వహిస్తున్నట్లు ఎల్బీనగర్ సహాయ అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనయ్య వెల్లడించారు. ఇందులో భాగంగా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే రామోజీ ఫిల్మ్ సిటీలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టామని, ఇక్కడ పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు ఆదర్శనీయముమన్నారు. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన హయత్నగర్ అగ్నిమాపక కేంద్రం రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏప్రిల్ 14నుంచి 20 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు హయత్ నగర్ స్టేషన్ అగ్నిమాపకశాఖ అధికారి యాదగిరి తెలిపారు. ఆర్ఎ్స్స పైర్ ఇన్ స్పెక్టర్ రమణ, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు..