న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోర్నియాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా

Missing & Wanted Missing & wanted

Posted by CityPolice-Admin on 2026-03-24 11:10:59 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1


న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోర్నియాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా

న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోర్నియాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా


పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ అంజా ప్రాంతంలోని పార్క్ హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు.

ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు.

ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతిఅమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడానన్నారు.. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకిత్, విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది.