Posted by CityPolice-Admin on 2026-03-24 11:31:23 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
ఇంటర్నెట్స్క్, దిల్లీలో 800 మందికి పైగా మిస్ అయ్యారంటూ ఆంగ్ల మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చాయి (Delhi Police). 15 రోజుల వ్యవధిలోనే వారంతా అదృశ్యమయ్యారని వాటి సారాంశం. ఆ వార్తల పై తాజాగా ఢిల్లీ పోలీసులు స్పందించారు. "ఢిల్లీలో వ్యక్తులు తప్పిపోతున్నారనే వార్తలకు పెయిడ్ ప్రమోషన్స్ కారణమని మేం గుర్తించాం. స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోను సహించబోం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని పోలీసులు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
గత ఏడాదితో పోలిస్తే.. కనిపించకుండా పోయినవారి సంఖ్యలో ఎలాంటి పెరుగుదల లేదని పేర్కొన్నారు. 2026లో నమోదైన కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించిందని చెప్పారు. అలాగే తప్పుడు వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కానీ తాజా గణాంకాలను మాత్రం వెల్లడించలేదు.ఇదీ చదవండి. ప్రజలే మిమ్మల్ని వద్దనుకున్నారు.. ప్రశాంత్ కిశోర్కు సుప్రీం చురకలు
దిల్లీ పోలీసు విభాగం డేటాను ఉటంకిస్తూ కొన్ని జాతీయ మీడియాల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి 15 మధ్యలో సగటున రోజుకు 54 మంది కనిపించకుండా పోయారని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆ లెక్కన 800 మందికి పైగా మిస్ అయ్యారని.. అందులో 509 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించాయి. కొంతమందిని గుర్తించినట్లు తెలిపాయి. దీనిపై ఆమ్ద్మీపార్టీ (AAP) విమర్శలు చేసింది. తప్పిపోయిన వ్యక్తుల నగరంగా ఢిల్లీ మారిందని అధికార భాజపాను దుయ్యబట్టింది. భాజపా ఈ విమర్శలను తోసిపుచ్చింది.