Posted by CityPolice-Admin on 2026-03-24 11:34:22 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
ఈనాడు, హైదరాబాద్: విలువలతో కూడిన విద్యకు క్రీడలు, సృజనాత్మకత తోడైతే విద్యార్థి బంగారు భవితకు సోపానం అవుతుంది. ప్రాధమిక దశలోనే క్రమశిక్షణ అలవరిస్తే ఉత్తమ పౌరుడిగా మారేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ అంశాల మేళవింపుతో రూపుదిద్దుకున్నదే 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్- హైదరాబాద్ (వైఐపీఎస్-హెచ్). విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిఉన్న ప్రతిభను చిన్నతనంలోనే వెలికితీయడం... తద్వారా లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా ప్రోత్సహించడం... గమ్యాన్ని చేరేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడం... ఇదే ఈ విద్యాసంస్థ ఉద్దేశం. ఆర్మీ స్కూల్, సైనిక్ స్కూల్, డిఫెన్స్ అకాడమీల్లా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పోలీస్ స్కూల్ను ఏర్పాటు చేశారు. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి 1-6 తరగతుల్లో ప్రవేశాల ప్రక్రియను తాజాగా ప్రారంభించిన నేపథ్యంలో విద్యాసంస్థ ప్రత్యేకతలపై కథనం...
తరగతి గదిలోనే కాకుండా క్రీడా మైదానంలోనూ చిన్నారుల్ని రాటుదేల్చడం ద్వారా మానసిక, శారీరక దృఢత్వం కలిగించాలనే సంకల్పంతో రాష్ట్రం ప్రభుత్వం ఈ పాఠశాలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో సువిశాల ప్రాంగణంలో దీన్ని నెలకొల్పారు. తొలుత ఐదు తరగతులతో ప్రారంభమైన ఈ విద్యాసంస్థలో ఇప్పటికే ఒక బ్యాచ్ పూర్తయింది. రెండో బ్యాచ్ కోసం ప్రవేశాల ప్రక్రియను తాజాగా ప్రారంభించారు. ఈ విద్యాసంస్థలో 18 మంది నిపుణులైన ఉపాధ్యాయులున్నారు.
పోలీస్ కుటుంబాలకు చెందిన పిల్లలకు 50% సీట్లను... ఇతరులకు మిగిలిన సీట్లను కేటాయించారు. పోలీస్ శాఖకు సంబంధించి హోంగార్డు మొదలుకొని ఐపీఎస్ అధికారుల పిల్లల వరకు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి విద్యార్థుల రాకపోకల కోసం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి బస్సు సదుపాయం కల్పించారు. భవిష్యత్తులో వసతిగృహాలను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనతో ఉన్నారు. పాఠశాల నిర్వహణ కోసం పోలీస్ఐఖలోని ఉన్నతాధికారులు, విద్యా నిపుణులు తదితరులతో సలహా మండలిని నియమించారు. భవిష్యత్తులో 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న క్యాంపస్లో 5 వేల సీట్లతో పాటు 1,750 పడకలతో వసతిగృహం ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.