Posted by CityPolice-Admin on 2026-03-24 11:37:22 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
ఇంటర్నెట్ డెస్క్. ఆన్లైన్లో చిన్నారులను వేధిస్తున్న వ్యక్తులపై అమెరికా పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో బల్కం నాగరాజు అనే తెలుగు యువకుడు ఉండటం గమనార్హం.
మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడే వారి భరతం పట్టడమే లక్ష్యంగా న్యూ మెక్సికోలోని శాంటా పే పోలీసులు రహస్య ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో డిటెక్టివ్లు పలు వెబ్సైట్లు, యాప్ ద్వారా రహస్య ఖాతాలను ఉపయోగించి నిందితులతో చాట్ చేశారు. ఈ నలుగురు నిందితులు మైనర్లను లైంగికంగా ప్రలోభపెడుతున్నట్టు గుర్తించారు. అనంతరం వారి ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు