Posted by CityPolice-Admin on 2026-03-24 11:40:06 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
ఇంటర్నెట్ డెస్క్: గ్యాంగ్ స్టర్లు, సంస్థాగత నేరమురాలపై పంజాబ్ (Punjab Police)
ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. 'ఆపరేషన్ ప్రహార్ (Operation Prihar) పేరుతో 72 గంటల పాటు దాదాపు 12 వేలమంది సిబ్బందితో విస్తృత స్థాయి ఆపరేషన్ ప్రారంభించినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. దాదాపు 1,200 మంది అనుమానితులను లక్ష్యంగా చేసుకుని, 2 వేల ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నామని డీజీపీ వెల్లడించారు. తమ నిఘా వర్గాలు అందించిన సమాచారంతో ఈ సిండికేట్ల నెట్వర్క్ పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పంజాబ్ను పూర్తిగా నేర రహితంగా మార్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆన్ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ పంజాబ్లో పెరుగుతోన్న గ్యాంగ్ స్టర్ సంస్కృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలను నిర్మూలించాలని.. ప్రజా భద్రతకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు 'ఆపరేషన్ ప్రహార్ ను చేపట్టారు