Posted by CityPolice-Admin on 2026-03-24 11:47:05 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
దిల్లీ: బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాల స్థానంలో ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నేర న్యాయ చట్టాలు (New Criminal Laws) జులై 1నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. జీరో ఎఫ్ఎఆర్ (Zero FIR), ఆన్లైన్లోనే పోలీసు ఫిర్యాదు (Online police complaints), ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటివి కీలక అంశాలు ఇందులో ఉండనున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్కు వెళ్లనవసరం లేకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వీలు కలుగనుంది. తద్వారా తేలికగా, వేగంగా సమస్యను తెలియజేయడంతోపాటు పోలీసుల స్పందనను సులభతరం చేస్తుంది.
జీరో ఎఫ్ఎఆర్ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పోలీసు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు.
బాధితులతోపాటు నిందితులు కూడా ఎఫ్ఎఆర్ కాపీలను ఉచితంగా పొందే వీలుంది. వీటితోపాటు పోలీస్ రిపోర్టు, ఛార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతలు డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందవచ్చు.
అరెస్టు సందర్భాల్లో బాధితుడు తమ సన్నిహితులు, బంధువులకు ఆ పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా తక్షణ సహాయం పొందేందుకు వీలు కలుగుతుంది.
అరెస్టుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తోతోపాటు జిల్లా హెడ్ క్వార్టర్లలోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్టు సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది.