Posted by CityPolice-Admin on 2026-03-24 11:49:48 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
హైదరాబాద్: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలకు
గురయ్యేవారు ఇకపై పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన పనిలేదు. ఇంటి నుంచే ఎఫ్ఎఆర్ పొందేందుకు అనువుగా 'సీ-మిత్ర'ను అందుబాటులోకి తెచ్చారు. అన్ని రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండేలా 24 మందితో కూడిన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సైబర్ నేరాల బాధితులు ఇంటి నుంచే ఎఫ్ఎఆర్ పొందేందుకు వీలుగా బషీరాబాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) కార్యాలయంలో 'సీ-మిత్ర' హెల్ప్ డెస్క్్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం అదనపు సీపీ (నేరవిభాగం) శ్రీనివాసులు, డీసీపీలు అరవింద్బాబు, అపూర్వారావు, చంద్రమోహన్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, రూపేశ్, వెంకటేశ్వర్లు, కిరణ్వరే, ఏసీపీ శివమారుతితో కలసి సీపీ సజ్జనార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. రూ.3 లక్షల లోపున్న కేసులను సీ-మిత్రలో జీరో ఎస్ఐఐఆటుచేసి.. సంబంధిత ఠాణాలకు బదిలీ చేస్తారు. రూ.3 లక్షలకు పైన ఉన్న ఫిర్యాదులను సైబర్ క్రైమ్ ఠాణాలో చేయవచ్చు.