Posted by CityPolice-Admin on 2026-03-24 11:55:19 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పేసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈనాడు-అమరావతి నేరాల బారిన పడ్డ బాధితులు ఇకపై ఏ పోలీసు స్టేషన్ పరిధిలోనైనా పిర్యాదు చేయవచ్చు. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ. ఎస్ఆర్ నమోదుకు పోలీసు స్టేషన్ సిబ్బంది నిరాకరించేందుకు వీల్లేదు. అత్యవసర విపత్కర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి పిర్యాదు అందితే 'జీరో ఎస్ఆర్' నమోదు చేయాల్సిందే. సత్వరమే స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిందే. ఆ తర్వాతే ఆ నేరం ఏ పోలీసు స్టేషన్ పరిదిలో జరిగిందో చూసి అక్కడికి బదిలీ చేయాలి. అలాగే బాధితులు నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లకుండానే పోలీసు అధికారిక వెబ్సైట్, యాప్ సహా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పద్ధతుల్లో పిర్యాదులు చేయవచ్చు. వాటిపై మూడు రోజుల్లోగా ఫిర్యాదుదారు సంతకం తీసుకుని ప్రాథమిక విచారణ. జరిపి కేసు నమోదు చేయాలి. ఇప్పటివరకూ అమల్లో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోసీఆర్పీసీ) ఈ ప్రొవిజన్లు లేవు. కేవలం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు జీరో ఎఫ్ఐఆర్ు నమోదు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాల్లో ఈ మేరకు 'జీరో ఎసఆర్ ఈ-ఎలఆర్కు చోటు కల్పించారు. ఏడేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశమున్న నేరాలకు సంబంధించి దర్యాప్తు అధికారులు నేర ఘటనా స్థలానికి పోరెన్సిక్ నిపుణులను తప్పనిసరిగా తీసుకెళ్లి వారి ద్వారా ఆధారాలు సేకరించాలి. నేర ఘటనా స్థలు, అక్కడున్న పరిస్థితులు, ఆధారాలన్నింటినీ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలి. దీని కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పోలీసు స్టేషను ట్యాబ్లు అందజేశారు. వాటిలో, రికార్డు చేస్తే అని నేరుగా ఈ సాక్ష్య డిజీలాకర్లోకి వెళ్తాయి. పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు వాటిని పరిశీలించుకోవచ్చు. ఆధారాలు మాయం