ఈనాడు, హైదరాబాద్: కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరినీ ఆదరించే మినీ ఇండియా 'భాగ్యనగరం

Traffic & Road Safety Traffic & Road Safety

Posted by CityPolice-Admin on 2026-03-24 12:02:12 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:


ఈనాడు, హైదరాబాద్: కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరినీ ఆదరించే మినీ ఇండియా 'భాగ్యనగరం

ఈనాడు, హైదరాబాద్: కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరినీ ఆదరించే మినీ ఇండియా 'భాగ్యనగరం. ఉపాది కోసం వచ్చే పేదవారి నుంచి పెట్టుబడిదారుల వరకు అందరికీ అవకాశాలు కల్పించి అక్కున చేర్చుకుంటుంది. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే ఇక్కడ అవకాశాలు, సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ గణాంక సంస్థ 'నంబియో' తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో జీవన వ్యయం చాలా తక్కువగా ఉందని పేర్కొంది. అద్దెను మినహాయిస్తే రూ.12వేల నుంచి రూ.50వేల ఖర్చుతో జీవిస్తున్నారని తెలిపింది.

నుంబియో మార్చి నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 21 నుంచి 21,7 మధ్య ఉంది. ప్రధాన నగరాల జాబితాలో హైదరాబాద్కు 6వ స్థానం. లభించగా.. కొనుగోలు శక్తిలో మెట్రో నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అంటే ఇక్కడ సంపాదించే డబ్బులతో ఇతర నగరాల కంటే ఎక్కువ సౌకర్యాలు పొందొచ్చు. అందుకే పల్లెల నుంచి నగరానికి వలసలు పెరుగుతున్నాయి. ఇక్కడికొస్తే ఆదాయం పెరగడంతో పాటు పిల్లలకు మెరుగైన విద్య అందించొచ్చని ఎక్కువ మంది భావించి ఆకర్షితులవుతున్నారు. జీవన వ్యయం విషయానికొస్తే సగటున ఒక్కో మనిషికి రూ.31,808.. కుటుంబానికి రూ.1,14,808 ఖర్చవుతోందని అధ్యయనంలో వెల్లడించింది. అద్దె విషయానికొస్తే బెంగళూరుతో పోల్చితే 33శాతం తక్కువ

Search
Recent News