Posted by CityPolice-Admin on 2026-03-24 12:05:36 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
ఎవరూ చూడట్లేదు కదా అని ట్రాఫిక్ సిగ్నల్ని జంప్ చేయడం మనకి కొత్తేం కాదు. ట్రాఫిక్ పోలీసులకు దొరికితే సరే, లేకపోతే చల్లగా జారుకుంటాం. అలా కాకుండా అక్కడ ఏ పోలీస్ మనల్ని ఆపకున్నా, మన బండిపైనా, కార్పైనా ఉన్న చలాన్లన్నీ బిల్బోర్డుపైన పెద్దగా కనిపిస్తే ఎలా ఉంటుంది? బెంగళూరు నగరంలోని ట్రినిటీ జంక్షన్లో ఉన్న బిల్బార్డులు ఏఐ టెక్నాలజీ సాయంతో ఇదే పనిచేస్తున్నాయి. అక్కడి ట్రాఫిక్ పోలీసులు... కార్స్ 24, క్రాష్ ఫ్రీ ఇండియా, మండే వెంచర్స్ సంస్థలతో కలిసి ఈ బిల్ బోర్డులని రూపొందించారు. వందమీటర్ల దూరం నుంచే మన వాహనాలపైన ఉన్న చలాన్లు, ఫిర్యాదులు ఉంటే అవీ, ఎన్ని చోట్ల సిగ్నల్ జంప్ చేశాం వంటి వివరాలన్నీ బిల్ బోర్డుల పైన తాటికాయంత అక్షరాలతో కనిపిస్తాయి.
అలాగే మన వాహనాలకు బీమా ఉందా, చెల్లిపోయిందా, పొల్యుషన్ సర్టిఫికెట్ ఉండా వంటి వివరాలన్నీ చూపిస్తాయి. ఏ చలాన్లూ లేకపోతే సరే... మరి ఉంటే ఇలా అందరి ముందూ కనిపిస్తే పరువు పోతుంది కాబట్టి చాలామంది చలాన్లని క్లియర్ చేసుకుంటున్నారట