ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరుకు చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు వార్తల్లో నిలిచాడు. రికార్డు సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు (Traffic rules violation) పాల్పడటమే అందుకు కారణం. అతడి స్కూటర్పై ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి

Traffic & Road Safety Traffic & Road Safety

Posted by CityPolice-Admin on 2026-03-24 12:17:23 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:


ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరుకు చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు వార్తల్లో నిలిచాడు. రికార్డు సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు (Traffic rules violation) పాల్పడటమే అందుకు కారణం. అతడి స్కూటర్పై ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరుకు చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు వార్తల్లో నిలిచాడు. రికార్డు సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు (Traffic rules violation) పాల్పడటమే అందుకు కారణం. అతడి స్కూటర్పై ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి. రూ.1.60లక్షల జరిమానా విధించిన పోలీసులు అతడి బైక్ ను సీజ్ చేశారు. చివరకు ఆ జరిమానా మొత్తం చెల్లించిన వాహనదారుడు బైక్ ను తీసుకొని వెళ్లిపోవడం గమనార్హం.

బెంగళూరులోని కలసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియాస్వామి ఓ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తున్నాడు. అతడి స్కూటర్పై రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణం, ప్రయాణంలో మొబైల్ వాడకం, సిగ్నల్ జంప్ తదితర కేసులున్నాయి. అయిన్నప్పటికీ పోలీసులు (Traffic Police) మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. సదరు వ్యక్తి వాహన చలానాలను ఏడాది కాలంగా గమనిస్తూ వస్తున్న స్థానిక పౌరుడు.. 'ఆ బైక్ ను పోలీసులు ఇంకా ఎందుకు సీజ్ చేయలేదంటూ' సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ట్రాఫిక్ ఉల్లంఘన, జరిమానాలకు సంబంధించిన స్క్రీన్షాట్ను జతచేశాడు.

Search
Recent News