Posted by CityPolice-Admin on 2026-03-24 12:38:52 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
దిల్లీ: తప్పిపోయిన పిల్లల (Missing Children) కేసుల విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court directs Centre) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా చిన్నారుల అదృశ్యం ఘటనల వెనుక ఏదైనా నెట్వర్క్ హస్తం ఉందా? రాష్ట్రస్థాయిలో ఏవైనా ముఠాలు పనిచేస్తున్నాయా? అనేది గుర్తించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ ఘటనల వెనుక ఏదైనా వ్యవస్థీకృత ముఠా ఉందా? యాదృచ్ఛికంగా జరిగాయా? అనేది నిర్ధారించాలని సూచించింది. కిడ్నాపర్ల నుంచి రక్షించిన పిల్లలను ఇంటర్వ్యూ చేసి, వాటి వెనుక ఎటువంటి ముఠాలు ఉన్నాయో తెలుసుకోవాలని పేర్కొంది. ఈమేరకు అన్ని రాష్ట్రాల నుంచి డేటాను సేకరించాలని చెప్పింది. రాష్ట్రాల్లో పిల్లల మిస్సింగ్, అక్రమ రవాణాపై 'గురియా స్వయం సేవి సంస్థాన్' అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
కాగా కొన్ని రాష్ట్రాలు తప్పిపోయిన పిల్లల సమాచారం ఇస్తున్నాయని.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ డేటాను పంచుకోవడానికి నిరాకరిస్తున్నాయని కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి న్యాయస్థానానికి తెలియజేశారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. అవసరమైతే సమాచారాన్ని అందించని రాష్ట్రాల విషయంలో కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రానికి సహకరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని సేకరించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిని నియమించాలని సూచించింది. అదృశ్యమైన పిల్లల కేసులను పర్యవేక్షించడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పోర్టల్ (Online Portal) లో అన్ని రాష్ట్రాల మిస్సింగ్ వివరాలను అప్లోడ్ చేయాలని