Posted by CityPolice-Admin on 2026-03-24 12:45:33 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
అద్దంకి: అమెరికాలో టూర్కు వెళ్లిన తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
హ్యూస్టన్ లో నివసిస్తున్న హరి.. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 22న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లాడు. అక్కడ డెనాలి సమీపంలోని ఓ హోటల్లో బస చేసి, జనవరి 3-4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్మేట్కు సమాచారం ఇచ్చాడు. డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడాడు. 31న హోటల్ నుంచి బయటకు వెళ్లాడు.
అనంతరం ఓ క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి హరి ఫోన్ స్విచాఫ్ వస్తోంది. హోటల్ నుంచి బయల్దేరిన తను.. ఆ క్యాబ్లో ఎక్కడికి వెళ్లారు? డ్రైవర్ ఎవరు? అనే కోణంలో అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు.