Posted by CityPolice-Admin on 2026-03-24 13:00:16 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
హైదరాబాద్: ఈ మధ్య సైబర్ నేరాలు (Cyber Crimes) విపరీతంగా
పెరుగుతున్నాయి. వీటిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఈ మోసాల గురించి మరింత అర్ధవంతంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు (Rachakonda Police) ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్ జోక్ తో ప్రజలను హెచ్చరించారు. "బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి.. తెలివిగా ఆలోచించండి" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.