Posted by CityPolice-Admin on 2026-03-24 13:18:13 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా ఇతర కీలక ప్రాంతాల్లో 126 ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు(ముఖాలను గుర్తించగలిగే కెమెరాలు) ఏర్పాటు చేశారు. సీసీటీఎన్ఎస్ డేటాబేస్లోని 1.30 లక్షల మంది పాత నేరగాళ్ల చిత్రాలు, వారి వివరాలను వాటితో అనుసంధానించారు. నగరంలో పాత నేరగాళ్లు తిరుగుతూ కెమెరాల్లో చిక్కితే... ఫేషియల్ రికగ్నిషన్ సెంటర్కు అప్రమత్తత సందేశం వస్తోంది. దాని ఆధారంగా వారిపై నిఘా పెడుతున్నారు.
ఫలితం: గతేడాది అక్టోబరు నుంచి దీనిని అమలు చేస్తున్నారు. దసరా ఉత్సవాల సమయంలో పాత నేరగాళ్ల కదలికల్ని గుర్తించి వారిని పట్టుకున్నారు. పలు కీలక కేసుల ఛేదనలో ఈ వ్యవస్థ ఉపయోగపడింది. అదృశ్యమైన (మిస్సింగ్) వారి ఫొటోలను ఈ డేటాబేస్ కు అనుసంధానించి, ఆచూకీ కనిపెడుతున్నారు.ఈ-డిప్లాయిమెంట్
బందోబస్తు ప్రణాళిక రూపకల్పన, సిబ్బందికి విధుల కేటాయింపు గతంలో మ్యాన్యువల్గా చేసేవారు... దీనికి కనీసం 2-3 రోజుల సమయం పట్టేది. ఈ-డిప్లాయిమెంట్ వల్ల ఇప్పుడు 6 గంటల్లోపే ప్రక్రియ పూర్తవుతోంది. సిబ్బంది వారికి కేటాయించిన పాయింట్లకు వెళ్లిన వెంటనే క్యూఆర్, జియో ఫెన్స్డ్ ఆధారిత హాజరు పడిపోతోంది.