బీఆర్ఎస్ నేతల అరెస్ట్: హరీశ్ రావు, తలసాని హౌస్ అరెస్ట్, ఎమ్మెల్యే సునీతా, మాలోతు కవితతో పోలీసులతో వాగ్వాదం

తెలంగాణ తెలంగాణ

Posted by pallavi on 2024-09-13 11:48:57 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 133


బీఆర్ఎస్ నేతల అరెస్ట్: హరీశ్ రావు, తలసాని హౌస్ అరెస్ట్, ఎమ్మెల్యే సునీతా, మాలోతు కవితతో పోలీసులతో వాగ్వాదం

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసంలో ఈరోజు BRS పార్టీ సమావేశం ఏర్పాటుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న కౌశిక్ ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, BRS నేతలను అందుబాటులోనే అరెస్టు చేస్తున్నారు.

మాజీ మంత్రులు హరీశ్ రావు మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. BRS నేతల ముందస్తు అరెస్టులను హరీశ్ రావు తప్పుపట్టారు. "MLA కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా, BRS శ్రేణులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే MLA గాంధీ, ఆయన అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు. తన భుజం నొప్పిగా ఉందని, ఆస్పత్రికి వెళ్తానని చెప్పారు. అయితే, హరీశ్ రావు ఇంటి నుండి బయటకు పంపడం లేదని పోలీసులు తెలిపారు. అరెస్టు సమయంలో తన చేతికి గాయం అయినట్లు పేర్కొన్న ఆయన, ఆస్పత్రికి వెళ్ళి చూపించుకోవాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఆయనను హౌస్ అరెస్ట్ చేశామని, తరువాత తామే ఆస్పత్రికి తీసుకెళ్లుతామన్నారు.

అలాగే, హరీశ్ రావును కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మరియు మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను కలవడానికి వీల్లేదంటూ వారిని బయటే నిలిపివేశారు. దీంతో, వారు పోలీసులతో వాగ్వాదం చేసి, తమ ఎమ్మెల్యేను కలవడానికి అనుమతి కావాలా, మీకు అభ్యంతరం ఎందుకు అంటూ ప్రశ్నించారు.

Search
Categories