న్యూజెర్సీలో NAKS సంక్రాంతి సంబరాలు

News News

Posted by admin on 2025-01-29 16:03:15 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 17


న్యూజెర్సీలో NAKS సంక్రాంతి సంబరాలు

ఉత్తర అమెరికా కమ్మ సంఘం (NAKS) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో శనివారం నాడు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా అలంకరించిన వేదిక వద్ద పెద్దలు, పిల్లలు సందడి చేశారు. ఈ సందర్భంగా పలు పోటీలను నిర్వహించారు. ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ సంబరాల్లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.

నార్త్ అమెరికా కమ్మ సంఘం: కమ్మవారు అందరినీ ఒక్కటి చేస్తు నార్త్ అమెరికాలో ఏర్పడ్డ సంఘమే నార్త్ అమెరికా కమ్మ సంఘం(NAKS). 2024లో ఏర్పడ్డ ఈ సంఘం కమ్మ సభ్యులందరికీ విస్తృతమైన సేవలో అందిస్తుంది. కమ్మ కులం అభివృద్ధే ధ్యేయంగా, ఆ సామాజిక వర్గ విద్యార్థులకు ఉపకారవేతనాలు, విద్యా సదస్సులు, వైవాహిక వేదికలు, ప్రయాణాలు, వ్యాపార అవకాశాలకు బాసట, వైద్య శిబిరాలు, తెలుగు పండుగల నిర్వహణ వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. ఇటీవల ఏపీ వరదలకు సహాయంగా నార్త్ అమెరికా కమ్మ సంఘం ద్వారా ₹30 లక్షలను ముఖ్యమమత్రి చంద్రబాబుకు సంస్థ ప్రతినిధులు అందజేశారు.

Search
Categories