Posted by admin on 2024-09-12 05:35:57 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 91
బుడమేరు వరదనీరు ఏపీ ప్రజలను ఎంతగా అతలాకుతలం చేసిందో మనందరికీ తెలుసు. ఈ ప్రమాదంలో చాలామంది ఇల్లు మునిగిపోగా.. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి ఘటన మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగ్‌నగర్‌లో వరదల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడేందుకు ఓ యువకుడు సాహసం చేశాడు. తన డెయిరీ ఫాంలో చిక్కుకున్న అన్నతో పాటు మరో ఇద్దరు వర్కర్లను కాపాడేందుకు చంద్రశేఖర్ అనే యువకుడు వెళ్లాడు. అయితే వీళ్లన్ని కాపాడి ఒడ్డుకు చేర్చిన తర్వాత అదే నీటిలో చంద్రశేఖర్ అనే యువకుడు నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. చంద్రశేఖరకు 15 నెలల క్రితమే వివాహం జరిగింది. నలుగురిని కాపాడి తన ప్రాణాలను విడిచిన చంద్రశేఖర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెళ్ళు వెత్తుతున్నాయి. చంద్రశేఖర్ సూపర్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు.