Posted by admin on 2024-09-12 05:46:18 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 24
అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి ఘటన 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ క్రమంలో న్యూయార్క్ లోని 9/11 మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించగా అందులో జో బైడెన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ట్రంప్ 2024 అని ఉన్న టోపీని బైడెన్ ని తన తల పై ధరించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.ఈ కార్యక్రమంలో బైడెన్ తో పాటు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి కొంత మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ట్రంప్ 2024 అని ఉన్న టోపీని ట్రంప్ మద్దతుదారుడు ఒకరు పెట్టుకున్నారు.
అది చూసిన బైడెన్ సరదాగా ఆ వ్యక్తితో కాసేపు మాట్లాడి ఆ టోపీని తీసుకుని ధరించారు. దీనికి సంబంధించిన వీడియోను వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ సందర్భాన్ని ఆయన ఐక్యతకు నిదర్శనంగా పేర్కొన్నారు.
కమలా,ట్రంప్….
9/11 మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ , మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కరచాలనం చేసుకున్నారు.