Posted by admin on 2024-09-12 05:50:29 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 30
కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడి (Kinjarapu Ram Mohan Naidu) ని కీలక పదవి వరించింది. ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా ఆయన ఎన్నికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో జరుగుతున్న రెండో ఆసియా-పసిఫిక్ (Asia-Pacific) మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్ (Singapore) ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశం తరఫున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల రామ్మోహన్‌నాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దేశం తరఫున తనకు దక్కిన ఈ గౌరవాన్ని తాను మరింత బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడంతో పాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.