భగ్గుమన్న బంగారం ధర.. పెరిగిన వెండి ధర

ట్రెండింగ్ ట్రెండింగ్

Posted by admin on 2024-09-12 06:00:04 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 88


భగ్గుమన్న బంగారం ధర.. పెరిగిన వెండి ధర

ఈ నెలలో మొత్తంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు రెండు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. ఆ ప్రభావం మన దేశంలో కూడా కనిపించింది. దీంతో బంగారం ధరలు పెరిగాయి. ఇక వెండి ధరలు మాత్రం వరుసగా మూడోరోజూ పెరుగుదల నమోదు చేశాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 12న బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమని గోల్డ్ లవర్స్ కి షాకిచ్చాయని చెప్పవచ్చు.  ఇక ఈరోజు ఉదయానికి అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుదలతో  ట్రేడ్ అవుతున్నాయి.   ఈ నేపథ్యంలో ఆప్రభావం మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) కాస్త పెరుగుదల నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.  

Gold and Silver Price: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 380 రూపాయలు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా 410 రూపాయలు పెరిగింది.  ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోనూ ఈరోజు బంగారం ధరలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అక్కడా  22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వరుసగా 380ఎం 410 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. కేజీకి 500  రూపాయలు వెండి ధరలు పెరిగాయి.  దీంతో ఈ మూడురోజులు కలిపి వెండి రెండువేల రూపాయలు పెరిగినట్టయింది. 

ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 67,150

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,250

ఇక విజయవాడ ,  విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు తగ్గుదల   కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .  

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 67,150

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,250

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి.  ఈరోజు తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి. 

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 67,300

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 73,400

Gold and Silver Price: బంగారం ధరలు పెరగడంతో పాటు వైపు వెండి ధరలు కూడా వరుసగా మూడో రోజు పెరుగుదల కనబరిచాయి. హైదరాబాద్ లోనూ ,  ఢిల్లీలోనూ కూడా వెండి ధరలు భారీగా పెరిగాయి. 

హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 91,500 గానూ ,  ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 86,500 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .  

ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల  కనిపిస్తోంది.   ఈరోజు అంటే సెప్టెంబర్ 12 ఉదయం 7 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,514.67 డాలర్ల వద్ద ఉన్నాయి.  అలాగే వెండి ధరలు మరింత పెరిగాయి. దీంతో కేజీకి 925.10 డాలర్లకు దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి.

Search
Categories