Posted by admin on 2024-09-12 06:06:30 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 91
వర్షాకాలం అనేక అనారోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం. పిల్లల్లో పెద్దల్లో ఎక్కువగా జలుబు, గొంతు నొప్పి, గొంతు గరగర వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వలన వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడానికి కారణమని చెప్పవచ్చు. అయితే వీటితోపాటు జీర్ణ సమస్యలు, దగ్గు, కీళ్ల నొప్పులు వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ చిన్న వాటికి ఆస్పత్రిలోకి వెళ్తూ చికిత్స తీసుకుంటారు. అయితే గొంతులో గరగర జలుబు అజీర్తి , చిన్న సమస్యలకు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేదిక నిపుణులు. అల్లం రాతి ఉప్పు ఈ సమస్యలను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుందట. మరి వీటిని ఏ విధంగా వాడాలో దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అల్లం-రాతి ఉప్పు వల్ల ఉపయోగాలు:
అల్లం కూరల్లో ఎంతో రుచిని ఇస్తుందని మనందరికీ తెలుసు. అయితే దీనిని రసం తాగిన ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కడుపుబ్బరం, గొంతునొప్పి, గొంతు గరగర, అజీర్తి వంటి సమస్యలు ఉంటే రాతిఉప్పు- అల్లం వెంటనే ఉపశమనం ఇస్తుంది. దీనికి మీరు చేయాల్సిన పని ఏమిటంటే.. రాత్రి భోజనం చేసేముందు అల్లం ముక్క మీద కొద్దిగా రాతిఉప్పు కలిపి తింటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. వీటిని రెండు విధాలుగా తిసుకోవచ్చు.. 1. అల్లం చిన్న ముక్కలుగా తీసుకొని రాతి ఉప్పును దానిపై కొంచెం చల్లాలి భోజనానికి పది నిమిషాలు ముందు దీనిని తినాలి. ఇలా తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా పని చేస్తుంది. అంతేకాకుండా గొంతులో గరగర కూడా వెంటనే తగ్గిపోతుంది. 2వ పద్ధతి.. అల్లాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో రాతి ఉప్పు కలిపి దీనిని కూడా భోజనానికి ముందు తినాలి. ఎలా చేయడం వలన గొంతులో గరగర తగ్గటంతో పాటు శరీరంలో రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఇది కాకుండా అల్లాన్ని మరిగించి ఆ నీటిని వడకట్టి తాగినా శరీరానికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.