Posted by admin on 2024-09-12 06:06:57 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 136
CM Revanth reddy: మనకు కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే, నేరస్తులకు కాదని, ఖాకీ డ్రెస్ ఉన్నది ప్రజల కోసమే అనే విశ్వాసం కల్పించేలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఎస్సైలు, ఏఎస్ఐలు పని చేయాలని సూచించారు. బుధవారం రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్‌ఐలు, ఏఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. యువత, నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాలు, డ్రగ్స్ నియంత్రణ, పోలీసింగ్, హైడ్రా, రుణమాఫీ వంటి పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్, వరంగల్‌లో ఒక్కోచోట 50 ఎకరాల్లో రెసిడెన్షియల్స్ ను రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.