కుర్చీపై కూర్చొని పని చేస్తే జాగ్రత్త.. ఈ అవయవాలకు హాని
లైఫ్ స్టైల్
లైఫ్ స్టైల్
Posted by admin on 2024-09-12 06:07:21 |
Share: Facebook |
Twitter |
Whatsapp |
Linkedin Visits: 81
ప్రస్తుతం అంతా కంప్యూటర్ యుగం అయిపోయింది. ఏ వర్క్ చేయాలన్నా కంప్యూటర్లలోనే చేయాలి. అంతేకాదు ఉన్న 24 గంటల్లో 10 నుంచి 16 గంటలు పనిచేసే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చుంటే అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కూర్చునే పద్ధతిని బట్టి అవయవాలు కూడా పనిచేస్తాయట. ఈ మధ్యకాలంలో 8 నుంచి12 గంటలు కంప్యూటర్ల దగ్గర పనిచేసే వాళ్లు ఉన్నారు. ఏ విధంగా కూర్చోవాలి, కూర్చునే పొజిషన్ సరిగ్గా లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కుర్చీపై కూర్చొని ఎక్కువ పని చేసే ఎదుర్కోనే సమస్యలు:
- చాలా సేపు అదే భంగిమలో కుర్చీపై కూర్చుని ఎటువంటి కదలికలు చేయకపోతే శరీరంలోని దిగువ భాగం పెరగటంతోపాటు కొవ్వు పేరుకుపోతుంది.
తప్పుడు పద్ధతిలో కుర్చీపై కూర్చొని గంటల తరబడి పని చేయడం వలన ఏకాగ్రత తగ్గుతుందట. ఎందుకంటే అసౌకర్యంగా కూర్చున్నప్పుడు వ్యక్తి దృష్టి పదే పదే ఒకే చోటికి వెళ్తుంది. కాబట్టి సరైన వీపు, చేయి మద్దతుతో కుర్చీపై కూర్చోవాలి. - కుర్చీపై కూర్చొని కంప్యూటర్‌లో పని చేసేవారికి.. కీబోర్డ్‌పై నిరంతరం వేళ్లను కదిలించే వారికి చేతులు, భుజాలలో నొప్పి వస్తుంది.
- గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది. కుర్చీపై కూర్చొని పనిచేసేటప్పుడు భుజాలు, పొట్ట, నడుము భాగాల్లో రక్తప్రసరణ సరిగా జరగదు. దీనివల్ల శరీరంలో జలదరింపు, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి.
- కుర్చీ మద్దతు ఇవ్వకపోతే, మద్దతు లేకుండా కూర్చొని ఉంటే.. అది నడుము నొప్పిని కలిగిస్తుంది. ఈ నొప్పి మెడ నుంచి మొదలై తోక ఎముక వరకు వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.