Posted by admin on 2024-09-12 06:27:26 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 60
Actor Jeeva: తమిళ నటుడు జీవా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. జీవా తన భార్యతో కలిసి చెన్నై నుంచి చిన్న సేలం వైపుగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో జీవా కారు కళ్లకురిచి జిల్లా కన్నియమూర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది. అటుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు జీవా, ఆయన భార్య ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడినట్లు సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో జీవా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట జనాలు గుమిగూడి ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
జీవా తెలుగులో పొలిటికల్ డ్రామా రంగం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవలే మళ్ళీ తెలుగులో యాత్ర 2 సినిమాలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం తెలుగు, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కీలక పాత్ర పోషిస్తున్నాడు.