Posted by admin on 2024-09-12 06:31:35 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 70
Raghu Thatha: నేషనల్ అవార్డు విన్నర్ నటి కీర్తి సురేష్ లీడ్ రోల్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘రఘుతాత’. ఆగస్టు 15న తమిళంలో గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక థియేటర్ రిజల్ట్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో రిలీజైన నెలలోనే ఓటీటీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఓటీటీ డేట్, స్ట్రీమింగ్ ప్లాట్ లాక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తెలుగులో థియేట్రికల్ రిలీజ్ లేకుండానే ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం.
రఘుతాత ఓటీటీ స్ట్రీమింగ్
తమిళంలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో మూడు భాషల్లో రాబోతుంది. రఘుతాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో సెప్టెంబర్ 13నుంచి స్ట్రీమింగ్ కానుంది. “కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ బ్లాక్‍బస్టర్ కోసం రెడీగా ఉండండి అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ముందుకు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ థియేటర్ రిజల్ట్స్ దృష్టిలో పెట్టుకొని ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హిందీ వ్యతిరేక ఉద్యమం
హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తితో పాటు రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాజీవ్ రవీంద్రనాథన్, ఎంఎస్ భాస్కర, దేవదర్శిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సీన్ రొనాల్డన్ సంగీతం అందించారు. 1960 బ్యాక్ డ్రాప్ లో హిందీ వ్యతిరేక ఉద్యమం అనే అంశంతో ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం కీర్తి తెలుగులో ‘ఉప్పుకప్పురంబు’, తమిళంలో ‘రివోల్టార్ రీటా’ అనే చిత్రాల్లో నటిస్తోంది. మరో వైపు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన ‘బేబీ జాన్’ చేస్తోంది.