లోన్ యాప్ లో తీసుకున్న లోన్ తీర్చకండి!

ట్రెండింగ్ ట్రెండింగ్

Posted by admin on 2024-09-12 06:41:36 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 82


లోన్ యాప్ లో తీసుకున్న లోన్ తీర్చకండి!

Loan Apps: అప్పు ముప్పు తెస్తుందని తెలుసు. కానీ, అవసరం ఆ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధపడేలా చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు కోసం వెతుకులాట మొదలవుతుంది. గతంలో ఇన్ని పక్కనో.. వీధి చివరో ఎవరో ఒకరు వడ్డీకి అప్పు ఇచ్చేవారు ఉండేవారు. ఇప్పుడు అలంటి వ్యక్తులు తగ్గిపోయారు. ఆధునికత పెరగడంతో.. లోన్స్ కోసం మన ఫోన్ లలోకి యాప్స్ వచ్చి చేరుతున్నాయి. ఈ యాప్స్ మన నెంబర్ కు రోజూ పదుల సంఖ్యలో మెసేజ్ లు పంపుతూ ఉంటాయి. మీకు లోన్ రెడీగా ఉంది. తక్కువ ఆపేపర్ వర్క్. క్షణాల్లో మీ బ్యాంక్ ఎకౌంట్ కు లోన్. ఇలా వరుసగా మెసేజ్ లు వస్తూనే ఉంటాయి. సరిగ్గా.. అత్యవసర పరిస్థితి వచ్చేసరికి ఈ లోన్ యాప్ మెసేజ్ గుర్తు వస్తుంది. అందులో ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి.. యాప్ ఇంస్టాల్ చేసుకుని.. లోన్ తీసుకుంటారు.  అవసరం కదా.. ఆ సమయంలో ఎవరూ కూడా  లోన్ కండిషన్స్ ఏమున్నాయని ఆలోచించరు. లోన్ తీసుకున్న తరువాత ఈఎంఐలు కడుతూ వస్తారు. అయితే, ఎప్పుడన్నా ఒక్కసారి ఇబ్బంది వచ్చి ఒక్క ఈఎంఐ మిస్ అయితే అద్దాలు కథ మొదలవుతుంది. యాప్స్ నిర్వాహకులు థర్డ్ పార్టీకి లోన్ తీసుకున్నవారి అన్ని డిటైల్స్ ఇచ్చేస్తారు. లోన్ మొత్తం రికవరీ బాధ్యత వారికీ అప్పచెప్పేస్తారు. ఈ థర్డ్ పార్టీ విశ్వరూపం మొదలు పెడుతుంది. లోన్ రికవరీ అయితే వారికీ డబ్బు వస్తుంది. అందుకోసం లోన్ తీసుకున్న వారిని ఎన్నిరకాలుగా వేధించాలో.. అన్ని రకాలుగానూ వేధిస్తారు. ఒకటి రెండూ కాదు రకరకాలుగా తిప్పలు పెడతారు. పరువు పోయే విధంగా చేస్తారు. దానికోసం వారు చేసే పనుల కారణంగా లోన్ తీసుకున్న వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చేరిపోతారు.  

Loan Apps: తాజాగా జీడిమెట్లలో ఇలాంటి ఉదంతం ఒకటి జరిగింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పెట్ బషీర్ బాడ్ లో భార్య, ఇద్దరు చిన్న పిల్లల్తో నివాసం ఉంటున్నాడు. ఒక ప్రయివేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రికి అనారోగ్య కారణంగా ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బు అవసరమై ఒక లోన్ యాప్ నుంచి భార్య పేరుపై డబ్బు తీసుకున్నాడు. చాలా నెలల పాటు సక్రమంగా ఈఎంఐ చెల్లిస్తూ వచ్చాడు. ఇటీవల అతని జీతం సమయానికి అందకపోవడం.. ఇతర ఇబ్బందుల కారణంగా ఈఎంఐ మిస్ అయ్యాడు. దీంతో లోన్ యాప్ నుంచి వేధింపులు మొదలు అయ్యాయి. రోజుకు పదుల సంఖ్యలో ఫోన్లు రావడం ప్రారంభం అయింది. ఒకరోజు భార్య పుట్టింటికి వెళ్ళింది. ఆ సమయంలో ఇతని ఫోన్ కు వచ్చిన కాల్స్ ఎటెండ్ కాలేదు. దీంతో క్షణాల్లో అతని భార్య ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి అతని కాల్ లిస్ట్ లోని స్నేహితులు, బంధువులకు ఈ ఫోటోలు పంపించారు. దీంతో అవమానం భరించలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Loan Apps: ఇలాంటి సంఘటనలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నిజానికి మన దేశంలో అప్పు ఇవ్వాలన్నా.. ఇలా యాప్స్ ద్వారా లోన్స్ ఇవ్వాలన్నా.. దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి. కేవలం ఆర్బీఐ అనుమతించిన కంపెనీలు లేదా బ్యాంకులు మాత్రమే ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించడానికి అర్హత కలిగి ఉంటాయి. అయితే, ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది లోన్ యాప్స్ క్రియేట్ చేసి అత్యధిక వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. దీని కారణంగా వారికి అసలు కంటే వడ్డీ రూపంలో నాలుగు రేట్లు ఎక్కువ డబ్బు వచ్చి చేరుతుంది. ఇలా అనుమతులు లేని యాప్స్ నిర్వాహకులు దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడతాయి. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం లోన్ తీర్చలేదనే కారణంతో ఒక వ్యక్తిని వేధించడం నేరం. లోన్ వసూలు చేసుకోవాలన్నా దానికి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు లోబడి మాత్రమే వారు వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, ఆర్బీఐ అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్న లోన్స్ యాప్స్ నిర్వాహకులు ఆ నియమాలు పాటించరు. పైగా.. వేధింపుల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గరు. అవతల వ్యక్తి ప్రాణం పోతుంది అని చెప్పినా.. విడిచి పెట్టారు.. ప్రాణాలంటే లెక్క చేయరు. వాళ్ళకి కావలసింది డబ్బు. అంతే. 

Loan Apps: అందుకే, ఎప్పుడైనా ఏదైనా అవసరం పడితే ఆర్బీఐ అనుమతి పొందిన యాప్స్ నుంచే లోన్స్ తీసుకోవాలి. ఒకవేళ ఇలాంటి వేధింపుల యాప్స్ నుంచి  తీసుకోవాల్సి వచ్చి.. తీసుకుంటే తరువాత ఇబ్బందులు పడాలి. ఈ నేపథ్యంలో ఎవరినైనా లోన్ యాప్స్ నిర్వాహకులు వేధిస్తుంటే, వారిపై పోలీసు కంప్లైంట్ ఇవ్వండి. వేధింపులు చేసే యాప్స్ కు లోన్ డబ్బు ఒక్కరూపాయి కూడా కట్టకండి. వేధింపులు ఆపితే, పధ్ధతి ప్రకారం వస్తేనే డబ్బు కడతామని కచ్చితంగా చెప్పండి. ఎక్కువ తక్కువగా బెదిరింపులు చేసినా.. మీపై శారీరకంగా దాడులు చేసినా.. ఫోటోలను పదిమందికీ పంపించి అల్లరి చేసినా ఒక్కరూపాయి కూడా కట్టకుండా.. నేరుగా పోలీసులను సంప్రదించండి. అలాగే ఆ లోన్ యాప్ వివరాలతో ఆర్బీఐ కి ఫిర్యాదు చేయండి. మీరు ప్రాణాలు తీసుకోవడం వలన సమస్య తీరిపోదు. నిలబడి పోరాడండి. నైతికంగా అప్పు ఎగ్గొట్టడం కరెక్ట్ కాదు కానీ, మన బలహీనతను ఆసరాగా చేసుకుని వేధించే వారితో ఆ రకంగా ప్రవర్తించడమే కరెక్ట్. ఇటువంటి లోన్ యాప్స్ చేసేదే చట్ట వ్యతిరేక వ్యాపారం. పైగా బెదిరింపులతో ప్రజలను భయభ్రాంతులు చేసే నైజం. ఇది కూడా చట్టం ఏమాత్రం సమ్మతించదు. అందువల్ల ధైర్యంగా ఉంది సమస్యను ఎదుర్కోవడం మంచిది.

Search
Categories