Posted by admin on 2024-09-12 08:05:36 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 108
Indian Child Died In America : అమెరికా (America) లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు చిన్నారులు ఓ సరస్సులో మునిగి చనిపోయారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… న్యూయార్క్ (New York) లాంగ్ ఐలాండ్ లోని హెల్ట్స్ విల్లేలోని ఓ అపార్ట్‌మెంట్ లో డేవిడ్ , సుధాగాలి అనే తెలుగు దంపతులు నివసిస్తున్నారు.
వీరికి రూత్ ఎవాంజెలిన్ గాలి (4), సెలాహ్ గ్రేస్ గాలి (2) అనే పిల్లలు ఉన్నారు.. శనివారం వారిద్దరూ ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కానీ ఎంతసేపటికి వారు తిరిగి ఇంటికి రాలేదు. దాంతో వారి తల్లి ఇంటి చుట్టుపక్కలంతా వెతికింది. అయినప్పటికీ కనిపించకపోవడంతో తప్పిపోయి ఉంటారని భావించి వెంటనే 911కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
ఆమె సమాచారం మేరకు పోలీసులు రెస్క్యూ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ సమీప ప్రాంతాలలో వెతికారు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు అపార్ట్‌మెంట్ సమీపంలోని సరస్సులో తేలియాడుతూ కనిపించారు.
వెంటనే వారిని బయటకుతీసి దగ్గరిలోని స్టోనీబ్రూక్ యూనివర్సిటీ (Stony Brook University) ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే పిల్లలు చనిపోయినట్లు తెలిపారు. అయితే చిన్నారుల తండ్రి డేవిడ్ వీసా సమస్య కారణంగా స్వదేశంలోనే ఉన్నట్లు సమాచారం.