హత్యకు కారణమైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. దారి కాచి మరి..!

క్రైం క్రైం

Posted by admin on 2024-09-12 08:10:12 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 109


హత్యకు కారణమైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. దారి కాచి మరి..!

Eluru: ఫ్లెక్సీల వల్ల నిత్యం ఏదో ఒక ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. రాజకీయ పార్టీ నేతల ఫెక్సీలు, సిని నటుల ఫ్లెక్సీల ఏర్పాటులో ఎన్నోసార్లు ఘర్షణలు జరిగిన సంఘటనలు మనం చూశాం. అయితే, తాజాగా ఫ్లెక్సీ వివాదం ఏకంగా హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ దారుణమైన ఘటన ఏలూరు జిల్లా కైకలూరులో చోటుచేసుకుంది. 

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం హత్యకు కారణమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ముదినేపల్లి మండలం ఊటుకూరు గ్రామంలో బాలకోటయ్య అనే వ్యక్తిని ప్రత్యర్ధులు కత్తులతో నరికి చంపారు. మే నెలల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను గ్రామంలో పెట్టిన సందర్భంలో గ్రామస్తులతో వివాదం తలెత్తిందని.. ఆ కక్షల కారణంగానే  నేడు దారి కాచి చెరువు నుంచి వస్తున్న బాలకోటయ్యను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపట్టారు.

Search
Categories