Posted by pallavi on 2024-09-13 10:52:57 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 24
ఏపీ సీఎం చంద్రబాబును కొద్దిసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ కలవనున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ. 50 లక్షల విరాళాన్ని అమరావతిలో స్వయంగా సీఎంను కలసి అందించనున్నారు. అనూహ్య వరదల వల్ల ఇబ్బంది పడిన బాధితులకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబును పలువురు దాతలు కలిసి తమ విరాళాలు అందజేశారు. చిత్రసీమ నుంచి కూడా ప్రముఖులు పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నారు. నిన్న నందమూరి బాలకృష్ణ, డీజే టిల్లు ఫేమ్ సిద్దు, విశ్వక్ సేన్ స్వయంగా చంద్రబాబును కలసి విరాళాలు ఇచ్చారు.
ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా రూ. 50 లక్షల చెక్కును సీఎంకు అందజేయనున్నారు. నిన్న రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి రూ. 5 కోట్ల చెక్కు, ఆంధ్రా షుగర్స్ తరఫున పెండ్యాల అచ్యుత రామయ్య రూ. 2 కోట్లు, విక్రం నారాయణ రావు కుటుంబ సభ్యులు రూ. 1.55 కోట్లు, వసుధా ఫార్మా తరఫున వెంకటరామరాజు రూ. 1 కోటి, ఏఎంఆర్ గ్రూప్ తరఫున మహేశ్వరరెడ్డి రూ. 1 కోట్ల చెక్కును అందజేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అక్కినేని వెంకట్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, క్రెడాయ్ తరఫున వైవీ రామారావు రూ. 50 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు.