ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం, వరద పరిస్థితులపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్

Posted by pallavi on 2024-09-13 10:55:33 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 19


ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం, వరద పరిస్థితులపై సమీక్ష

అమరావతి: ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పెద్ద నష్టం జరిగింది. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రోజు కేంద్ర బృందం ప్రకాశం బ్యారేజీని పరిశీలించింది.

జలవనరుల శాఖ అధికారులు బ్యారేజీలో నీటి ప్రవాహం తదితర అంశాలను బృందానికి వివరించారు. ఈఎస్‌సీ వెంకటేశ్వర్లు వివరాలను అందజేస్తూ, ఈ నెల 1న రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించిందని తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంత పరిస్థితులు, ముంపు ప్రాంతాల వివరాలను బృందానికి వివరించారు.

ఇక ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 15.30 అడుగులు నమోదవగా, సముద్రంలోకి 15.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కోనసీమలో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉండటంతో పడవల ద్వారా రాకపోకలు కొనసాగుతున్నాయి.

Search
Categories