Posted by pallavi on 2024-09-13 11:05:08 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 95
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమాకు అరుదైన ఘనత లభించింది. ఈ సినిమా లాస్ ఏంజెల్స్లోని బియాండ్ ఫెస్ట్లో ప్రదర్శించబడనుంది. ఈనెల 26న సాయంత్రం 6.30 గంటలకు ప్రఖ్యాత ఈజిప్షియన్ థియేటర్లో షో జరుగనుంది. ఈ విషయం సినీ వర్గాలు తెలిపారు.
అలాగే, ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీసేల్ టికెట్ బుకింగ్స్‌లో వన్ మిలియన్ సేల్ చేయడం విశేషం. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారా వన్ మిలియన్ మార్క్‌ను దాటిన సినిమాగా రికార్డుకెక్కింది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 57 నిమిషాలు 58 సెకన్లుగా ఉంటుంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్‌తో రూపొందించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు హైలైట్‌గా ఉంటాయని ఎన్టీఆర్ ముంబయిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పారు.