Posted by pallavi on 2024-09-13 11:23:47 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 78
వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడా అన్న ప్రశ్నకు ఫిలిం నగర్ వర్గాలు అవును అని జవాబిస్తోంది. ఇటీవల 'సరిపోదా శనివారం'తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన నాని ప్రస్తుతం 'హిట్-3' మరియు శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇప్పుడు, 'హ్యాపీ డేస్' ఫేమ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని ఓ కొత్త సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరుగాయని, నాని ఆమోదం తెలిపినట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2025లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం, శేఖర్ కమ్ముల 'కుబేర'తో బిజీగా ఉన్నారు.