మంత్రిఅంద్రజనాని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం: ఐదుగురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్

Posted by pallavi on 2024-09-13 11:29:59 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 36


మంత్రిఅంద్రజనాని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం: ఐదుగురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు

మంత్రిఅంద్రజనాని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం బూసాయవలస వద్ద, మంత్రిఅంద్రజనాని ఎస్కార్ట్ వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి మరియు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, మంత్రి సంధ్యారాణి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు, దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గిరిజన ప్రాంతాలలో అధిక వర్షాలతో సంభవించిన నష్టాన్ని మంత్రి పరిశీలించారు. అలాగే, దెబ్బతిన్న రోడ్లను కూడా పరిశీలించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో గిరిజన గ్రామాలకు శాశ్వత రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జీకేవీధి-సీలేరు రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిస్తానని, రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Search
Categories