Posted by pallavi on 2024-09-13 12:11:22 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 77
తిరుమల: ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగుతున్న నేపధ్యంలో, పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తెలిపింది. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, 15వ తేదీన తిరుప్పావడ, మరియు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేయబడతాయని టీటీడీ పేర్కొంది.
మూడు రోజుల పాటు, ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుండి 11 గంటల మధ్య స్నపనతిరుమంజనం జరుగుతుంది. సాయంత్రం, ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు, భక్తులకు దర్శనమిస్తారు అని టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులచేత లేదా సిబ్బంది చేత తెలియక కొన్ని చిన్నదోషాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటివి ఆలయ పవిత్రతకు మించకుండా, ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.