Posted by pallavi on 2024-09-13 12:25:45 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 92
ప్యాంగ్‌యాంగ్: భవిష్యత్తులో తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని విస్తృతంగా పెంచుకునే విధంగా ఉత్తరకొరియా పధకాన్ని తీసుకోనున్నట్లు ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. దేశం యొక్క 76వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కిమ్ మాట్లాడుతూ, ‘‘యుద్ధంలో ఉపయోగించేందుకు అనుగుణంగా దేశం యొక్క అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఎంత పెంచాలో ఎటు కావాలో హద్దు లేకుండా ఉంటుంది. ఈ విషయంలో పాలసీ రూపొందిస్తున్నాం. ఉనికిని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.
కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ మధ్య సంబంధాలు బలపడుతున్న సందర్భంలో, కిమ్ అణ్వాయుధాలను పెంచుకునే నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరుగనున్న వేళ, ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని దక్షిణ కొరియా అధ్యక్షుని భద్రతా సలహాదారు ఇటీవల చెప్పారు.
ఈ ఏడాది జూలైలో, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఈ సమయంలో కొరియా సముద్రంలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గాములు మరియు యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. అందుకే, కిమ్ అణ్వాయుధాల పెంపు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఉత్తరకొరియా కూడా అణ్వాయుధ శక్తిగా అవతరిస్తుందన్నారు. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని, ఆ సమయంలో ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించవచ్చని అంచనా వేయబడుతుంది. ఉత్తరకొరియా ఇప్పటికే బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేసింది, వాటిని దేశంలో ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు 250 మొబైల్ లాంచర్ వ్యవస్థలను తయారు చేసింది. తాజాగా, ఉత్తరకొరియాకు ఆత్మాహుతి డ్రోన్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి, వాటిని కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పరీక్షించారు.