నైజీరియాలో ఇంధన ట్యాంకర్-ట్రక్కు ఢీకొని 48 మంది మృతి; 50 పశువులు దహనమయ్యాయి

అంతర్జాతీయo అంతర్జాతీయo

Posted by pallavi on 2024-09-13 12:28:21 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 92


నైజీరియాలో ఇంధన ట్యాంకర్-ట్రక్కు ఢీకొని 48 మంది మృతి; 50 పశువులు దహనమయ్యాయి

నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్ మరియు ట్రక్కు ఢీకొనడం కారణంగా 48 మంది మృతి చెందారు. మరో 50 పశువులు మృతి చెందాయని ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ వివరాలను ఆ దేశ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇది పెద్ద ప్రమాదం అని పేర్కొంది.

నైజీరియాలో నార్త్-మధ్య నైజర్ రాష్ట్రంలోని ఆగాయి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో భారీ మంటలు ఎగసిపోయి, చుట్టుపక్కన ఉన్న వాహనాలను కూడా కూర్చి పోయాయి. ట్రక్కులో ఉన్న 50 పశువులు సజీవ దహనమయ్యాయి. మొత్తం 48 మంది మృతి చెందారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. మొదట్లో 30 మంది సజీవ దహనమయ్యారని, మరొక 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపింది.

మృతులకు సమీపంలోని ఒక ప్రాంతంలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపింది. నైజీరియాలో సరైన రైల్వే వ్యవస్థ లేకపోవడంతో కార్గో రవాణా కోసం వాహనాలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా ఉన్న నైజీరియాలో ఇటువంటి ప్రమాదాలు సాధారణంగా జరుగుతున్నాయి. 2020లో 1,531 ప్రమాదాలు జరిగినట్లు, వాటిలో 535 మంది మృతి చెందారని నివేదికలు సూచిస్తున్నాయి.

Search
Categories