Posted by pallavi on 2024-09-13 20:56:07 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 57
ల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు ఫిబ్రవరితో ముగిసింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల తేదీలకు సంబంధించి ఆసక్తి పెరిగిన నేపథ్యంలో, శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదలైంది. 14 నుంచి 21 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 18న జిల్లా స్థాయిలో, 19న మండల స్థాయిలో ఓటరు జాబితాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అభ్యంతరాలు పరిష్కరించి ఈ నెల 28న తుదిజాబితాను ప్రకటించనున్నారు.
జిల్లాలో 3.46 లక్షల ఓటర్లు
255 గ్రామ పంచాయతీల పరిధిలోని 12 మండలాల్లో 3,46,220 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,67,670, మహిళలు 1,78,530 మంది ఉన్నారు. గత 2019 ఎన్నికలతో పోలిస్తే 33,726 మంది ఓటర్లు పెరిగారు.
మహిళా ఓటర్లు అధికం
పల్లె ఓట్లలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం 3,46,220 మంది ఓటర్లలో మహిళలు 10,860 మంది అధికంగా ఉన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబరులో
255 గ్రామ పంచాయతీలకు 2,240 వార్డులకు అక్టోబరులో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2019లో కూడా మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ సారి రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు వస్తాయని భావిస్తున్నారు, ఇందుకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.