Posted by pallavi on 2024-09-13 20:59:21 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 67
ఆత్మహత్య చేసుకునే ముందు ఒక క్షణం ఆశావహ దృక్పథంతో ఆలోచించాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా సూచించారు. ఈ ఆలోచనే బతకడానికి ధైర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు.
శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ భాటియా మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ కోసం విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని చెప్పారు. ఈ ఏడాదిలో నాన్ హెల్త్ ప్రొఫెషనల్స్‌కి కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ రాహుల్ నారంగ్ మరియు మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా కూడా పాల్గొన్నారు.