Posted by Saikiran on 2024-01-27 06:43:49 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 151
ప్రస్తుత పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, రావిల్పిండికి 32 కి.మీ. దూరంలో తక్షశిల వద్ద తక్షశిల విశ్వవిద్యాలయం స్థాపించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మొదటగా వాల్మీకి రామాయణం తెలిపింది. ఇది ప్రపంచ చరిత్రలోనే ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయంగా ఉండి 10వేల మందికి పైగా విద్యార్థులతో వైద్యం, కళలు, విలువిద్యలు, ఖగోళశాస్త్రాలకు పేరుగాంచిందిగా ఉండేది. కాబట్టి దీనిని Ancient Institute of Higher - Learning అంటారు.
ఇది మౌర్యులు, ఇండో – గ్రీకుల పాలనలో వెలుగొందగా, తొరమానుల విధ్వంసం వల్ల తన క్రియాశీలతను కోల్పోయింది. అయితే, బుద్ధుని మిత్రుడు ప్రసేనజిత్, అనుచరుడు అంగులిమాల, వ్యక్తిగత వైద్యుడు జీవకుడు ఈ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. వీరే కాకుండా చరకుడు, పాణిని, కౌటిల్యుడు, చంద్రగుప్త మౌర్యుడు కూడా ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులే.