అమరవీరుల దినోత్సవం
History
Indian History
Posted by Saikiran on 2024-01-31 11:23:21 |
Share: Facebook |
Twitter |
Whatsapp |
Linkedin Visits: 59
మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించేందుకు (భగత్‌సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాప్ అనే ముగ్గురు వీర స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటీష్ వారు ఉరితీసిన రోజు మార్చి 23, అలాగే మహాత్మాగాంధీ జ్ఞాపకార్థం జనవరి 30ని) అమరువీరుల దినోత్సవం లేదా షాహిద్ దివస్‌గా పాటిస్తారు.
- జాతిపిత మహాత్మాగాంధీని 1948 జనవరి 30న సాయంత్రం ప్రార్థనల సమయంలో నాథూరామ్ గాడ్సే బిర్లా హౌస్ లో హత్య చేయగా, బాపూ తుది శ్వాస విడిచి అమరవీరుడయ్యారు.
- భారత ప్రభుత్వం ఈ రోజును గాంధీజీ భారతదేశ స్వాతంత్ర్యానికి చేసిన త్యాగాన్ని, భారతదేశం సంక్షేమం, అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తు చేసుకోవడానికి షహీద్ దివస్ లేదా అమరవీరుల దినోత్సవంగా రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరుపుతుంది.
- అలాగే దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి 1915, జనవరి 9న గాంధీ వచ్చిన రోజును ప్రవాసీ భారతీయ దివస్‌గా ప్రతి సంవత్సరం జనవరి 9న భారతదేశ అభివృద్ధిలో విదేశీ భారతీయులు సహకారాన్ని గుర్తు చేసుకుంటారు.
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయుధ దళాల సిబ్బంది, ఇంటర్ సర్వీసెస్ బృందం కూడా గౌరప్రదమైన వందనం/ నివాళులు అమరవీరులకు సమర్పిస్తుంది.