Posted by pallavi on 2024-09-13 19:14:57 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 140
మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) బెయిల్ రాదో..? వస్తుందో..? అన్న ప్రశ్నకు మార్చి 15 నుంచి ఆగస్ట్ 27 వరకు ఉన్న సస్పెన్స్‌కి ముగింపు కలిగింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ (Kavitha Bail) మంజూరు చేసింది. సుమారు గంటన్నరకు పైగా సుప్రీంకోర్టులో ఈడీ తరఫు, కవిత తరఫు లాయర్ల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. వాదనలు ఉధృతంగా ఉండడంతో ఇద్దరి లాయర్లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీనిలో మధ్యలో జోక్యం చేసుకున్న ధర్మాసనం కూడా ఇరువైపుల లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. చివరకు కవితకు బెయిల్ మంజూరైంది. ఈ విషయం గులాబీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. కవిత అరెస్టు నుండి జైలు జీవితం ఎలా సాగింది..? ఆమె ఎన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యారు..? బరువు తగ్గింది ఎంత..? వంటి విషయాలపై ప్రత్యేక కథనం.