కేటీఆర్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్.. 20 మంది ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలూ వెళ్ళడం వెనుక ఏముంది?

రాజకీయం రాజకీయం

Posted by pallavi on 2024-09-13 19:20:38 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 143


కేటీఆర్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్.. 20 మంది ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలూ వెళ్ళడం వెనుక ఏముంది?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. కేటీఆర్‌తో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు కూడా హస్తినకు బయల్దేరనున్నారు. ఈ బృందం సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్ళనుంది. ఈ పర్యటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ వెళ్ళడం సరే, అయితే మరో 20 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారు? ఢిల్లీలో ఎలాంటి ముఖ్యమైన పరిణామాలు జరగబోతున్నాయి? అని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇది ఏదైనా కీలక నిర్ణయానికి సంబంధించిన పర్యటనా, లేక మరేమైనా వెనుక ఉన్నాయా? అనే అంశంపై గులాబీ నేతల మధ్య చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.