హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అమరావతికి బయల్దేరే సమయాలివే!

రాజకీయం రాజకీయం

Posted by pallavi on 2024-09-13 19:22:35 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 55


హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అమరావతికి బయల్దేరే సమయాలివే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నారు, ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు. గత రెండు రోజులుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ చంద్రబాబు బిజీగా గడిపారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టి సారించి, వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్‌కు వచ్చి పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. పవన్ కూడా చంద్రబాబు బాటలోనే సాగుతూ, తరచుగా హైదరాబాద్‌లో కనిపిస్తున్నారు. పవన్ కూడా ఇవాళ ఏపీకి వెళ్లాల్సి ఉండగా, షెడ్యూల్‌ను రేపటికి మార్చుకుని, రేపు ఉదయం 8.30 గంటలకు బేగంపేట్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు.

Search
Categories