Posted by pallavi on 2024-09-13 19:41:16 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 94
కూరగాయలు, పప్పుల ధరలు పెరగడంతో ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.65 శాతానికి చేరింది. జూలైలో ఇది ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయి 3.6 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. పెరిగినప్పటికీ, ఆర్‌బీఐకు ప్రభుత్వం నిర్దేశించిన కట్టడి పరిధి 4 శాతం లోపే ఉంది. గత ఏడాది ఆగస్టులో ఇది 6.83 శాతం ఉంది. జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఆగస్టు నెలలో కూరగాయల ధరలు 10.71 శాతం, పప్పుల ధరలు 13.6 శాతం పెరిగాయి. సSugంధ ద్రవ్యాలు (-4.4 శాతం) మరియు ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ (-0.86 శాతం) విభాగాల్లో ధరలు తగ్గాయి. మొత్తం మీద, ఆహార వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం 5.66 శాతం గా నమోదైంది.