Posted by pallavi on 2024-09-13 19:48:11 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 89
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రభుత్వ రంగంలోని ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్‌ఎండీసీ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు భారీ పెట్టుబడులు పెట్టోంది. ఇందులో భాగంగా, విదేశాల్లో లిథియం, రాగి, నికెల్, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల అన్వేషణ మరియు ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే ఒక లిథియం నిక్షేపాల బ్లాకును గుర్తించిన ఎన్‌ఎండీసీ, లెగసీ ఇండియా ఐరన్ ఓర్ లిమిటెడ్ అనే అనుబంధ కంపెనీ ద్వారా ఈ కార్యకలాపాలు చేపట్టనుంది.
కాగా, వచ్చే ఏడాది చివరికల్లా దేశంలో ఏటా 80 లక్షల టన్నుల కోకింగ్ కోల్ ఉత్పత్తి ప్రారంభించనుంది. ప్రస్తుతం 4.5 కోట్ల టన్నుల వార్షిక ఇనుప ఖనిజం ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2030 నాటికి 10 కోట్ల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు.